కరోనా వల్ల క్రికెట్ నిలిచిపోవడంతో బౌలింగ్‌ను తాను చాలా మిస్సవుతున్నానని, అందుకే లాక్డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని టీమ్ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చెప్పాడు. టీవీ ప్రెసెంటర్ జతిన్‌తో చాహల్ శుక్రవారం మాట్లాడాడు. “ఒక్కసారి బయటకు వెళ్లేందుకు అనుమతి వచ్చాక నేను ఇంటికి వెళ్లకుండా లాక్డౌన్ విధించుకుంటా(నవ్వుతూ). మళ్లీ ఇంటికి వెళ్లను. ఇక ఎక్కువ కాలం ఇంట్లో ఉండలేను. ప్రస్తుతం ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నందున కనీసం మూడేండ్ల పాటు తిరుగుతూనే ఉంటా. దగ్గర్లో ఉన్న హోటల్లో ఉంటా గానీ ఇంట్లోకి వెళ్లను” అని చాహల్ సరదాగా చెప్పాడు.
“నాకు మైదానానికి వెళ్లాలని, బౌలింగ్ చేయాలని ఉంది. క్రికెట్నిలిచిపోవడంతో బౌలింగ్‌ను చాలా మిస్సవుతున్నా. గ్రౌండ్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది. లాక్డౌన్ మిగిసిన వెంటనే మైదానానికి వెళ్లి ఒక్క బంతైనా వేస్తా” అని చాహల్ చెప్పాడు. లాక్డౌన్ పార్ట్నర్గా ఎవరిని ఇష్టపడతావని అడుగగా “రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసుకుంటా” అని చాహల్ అన్నాడు.