మెడికల్ పీజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ అడ్మిషన్స్-2020 మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20 లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కోరింది. నీట్ పీజీ పరీక్షను జనవరి 5న నిర్వహించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నది. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్‌సైట్ mcc.nic.inలో చూడవచ్చు.