కరీంనగర్‌లో కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి నేడు కరీంనగర్ పట్టణంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. నగరం మొత్తం శానిటైజేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. మన నగర భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని.. మన నగరాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ప్రజలంతా సాధ్యమైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలన్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించారు.
కరీంనగర్ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా