ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకనుగుణంగా ఓయూ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ హాస్టళ్లను ఖాళీ చేయాలని సూచించారు. హాస్టళ్లకు మంచినీరు, విద్యుత్ సరఫరాను మంగళవారం నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఓయూ హాస్టళ్లు మూసివేత..